హైదరాబాద్: కంటెంట్ దొంగలకు ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఈనాడు’ లీగల్ డిపార్టమెంట్ వార్నింగ్ ఇచ్చింది. అత్యధిక సర్య్యులేషన్ గల తెలుగు దినపత్రిక ఈనాడు వార్తా సంస్థల్లో ప్రచురితమవుతున్న పలు ఆసక్తికర వార్తా కథనాలను కొందరు దొంగలు చోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. బరితెగించిన ఇటువంటి కంటెంట్ దొంగలకు ఈనాడు యాజమాన్యం ఆదివారం వార్నింగ్ ఇచ్చింది. ఈమేరకు సంస్థ లీగల్ డిపార్ట్మెంట్ చీఫ్ మేనేజర్ వెల్లంకి రత్నకుమార్ ఈనాడు పత్రికాముఖంగా ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.
ఈనాడు సంస్థకు చెందిన పత్రిక, వెబ్ సైట్, ఈ పేపర్ లలో ప్రచురితమైన కొన్ని వ్యాసాలు భిన్నరీతుల్లో ఎటువంటి హక్కులు లేకుండా, సంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా కొందరు సోషల్ మీడియాలో వాడుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఏ విధమైన అనుమతి లేని ఇటువంటి చర్యలు కాపీ రైట్ చట్టానికి విరుద్ధమని, శిక్షార్హమని పేర్కొన్నారు. ఈ తరహా నేరపూరత చర్యలను ఈనాడు తీవ్రంగా పరిగణిస్తోందని, ఇందుకు పాల్పడే బాధ్యులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని ఈనాడు లీగల్ విభాగపు చీఫ్ మేనేజర్ వెల్లంకి రత్నకుమార్ తన ప్రకటనలో హెచ్చరించారు.
ఇదీ చదవండి:

ఈ నేపథ్యంలో కంటెంట్ దొంగల చర్యలు మరోసారి తెలుగు పాఠకలోకంలో చర్చనీయాంశంగా మారాయి. తమకు సోషల్ మీడియాలో దొరికాయంటూ ఉన్నది ఉన్నట్లుగా కంటెంట్ చోరీకి పాల్పడుతూ జర్నలిస్టులుగా చెలామణి అవుతున్న అనేక మందికి ఈనాడు లీగల్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ప్రకటన సీరియస్ వార్నింగ్ గానే భావించవచ్చు.

