సీపీఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జాన్ వెస్లీని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. సంగారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర 4వ మహాసభల్లో జాన్ వెస్లీని పార్టీ నాయకత్వం కొత్త కార్యదర్శిగా ఎన్నుకుంది. కాగా 70 ఏళ్ళు దాటిన నేతలకు రాష్ట్ర కమిటీ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. వయసు రీత్యా రాష్ట కమిటీ నుంచి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, నర్సింగ రావులకు చోటు దక్కలేదని తెలుస్తోంది.

