Top 5 This Week

Related Posts

ఎస్ఈసీ పార్థసారథికి కరోనా

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఆయన తొలి డోసు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. ఎస్ఈసీ పార్థసారథి గురువారం కోవిడ్‌ పరీక్ష చేయించుకోగా, ఫలితాలు శుక్రవారం వచ్చాయి. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు పార్థసారథి ధ్రువీకరించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని పార్థసారథి సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 2 వేల 909 కరోనా కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు.

Popular Articles