Top 5 This Week

Related Posts

ఖమ్మం స్కూల్లో కరోనా కలకలం

ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలవరం కలిగించింది. ముదిగొండ మండలం పెద్దమండవలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూలుకు చెందిన 86 మంది విద్యార్థులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా, పది మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. దీంతో విద్యార్థులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వీరందరికీ కరోనా ఎలా సోకిందనే అంశంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles