Top 5 This Week

Related Posts

వనజీవి రామయ్య మృతికి సీఎం సంతాపం

‘వనజీవి’గా ప్రసిద్ధి చెందిన సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ అసాధ్యమని విశ్వసించి, ఈ సిద్ధాంతానికి తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రామయ్య అని సీఎం కొనియాడారు.

సామాన్య వ్యక్తిగా మొక్కలు నాటడం ద్వారా సమాజాన్ని స్ఫూర్తివంతం చేసిన రామయ్య మరణం సమాజానికి తీరని లోటని, ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. మొక్కలు నాటే ఉద్యమంలో వెన్నంటి నడిచిన రామయ్య సతీమణి జానమ్మకు, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వనజీవి రామయ్యతో మంత్రి పొంగులేటి (ఫైల్ ఫోటో)

వనజీవి మృతిపట్ల పొంగులేటి దిగ్బ్రాంతి:
కోటి మొక్కల ప్రదాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య అకాల మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య మృతి చెందటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు దశాబ్దాల కాలంగా కృషి చేశారని కొనియాడారు. కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికులకు ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయుడిని కోల్పోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్ధించారు. ఆయన భార్య జానమ్మకు , కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Popular Articles