Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలు చేసిన ప్రయత్నాలకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పీజులు పెంచుకుంటామని, అనుమతించాలంటూ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఫీజుల పెంపు అంశంలో ఇచ్చిన వినతులపై తెలంగాణా అడ్మిషన్స్, ఫీజుల రెగ్యులేటరీ కమిటి (TAFRC) నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సూచిస్తూ, ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే పీజుల పెంపు ఆధారపడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా ఫీజుల పెంపు విషయంలో దాఖలు చేసిన పిటిషన్ లో ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.

Popular Articles