Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఘనంగా బతుకమ్మ సంబురాలు షురూ!

తెలంగాణాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా బతుకమ్మ వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ మొదలైంది. వరంగల్ మహానగరంలోని వేయి స్తంభాల గుడిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి మాట్లాడుతూ, రాష్ట్రమంతా సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగతో సుఖశాంతులు పెంపొందాలని, మహిళలు సంపదతో ఆర్థికంగా ఎదగాలరి అన్నారు. పకృతిలో లభించే అనేక రకాల పూలతో తొమ్మిది రోజులపాటు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారి పూజలు ఫలప్రదమై రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారరి డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారని గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నారు. ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పలవంతం కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.

హన్మకొండ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాల చిత్రం

Popular Articles