Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

అనాథలు కాదని… నేనున్నానని…!

నటుడు సోనూ సూద్ చేసిన తాజా ట్వీట్ ఇది. యాదాద్రిలో ముగ్గురు పిల్లలు అనాథలుగా బతుకుతున్న దీన గాధపై సోనూ సూద్ మనసు మళ్లీ కరిగింది. మొన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఆడకూతుళ్ల చేత నాగలి లాగించిన రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ అందించడం, కరోనా లాక్ డౌన్ పరిణామాల్లో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ శారదకు మళ్లీ ఉద్యోగావకాశం కల్పించిన సోనూ దాతృత్వంపై ప్రశంసల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే యాదాద్రికి చెందిన ముగ్గురు పిల్లల అనాధ జీవితాలపై సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూ సూద్ స్పందిస్తూ ‘ఇకపై వాళ్లు అనాథలు కాదు, వారి బాధ్యత నాదీ’ అంటూ భరోసా ఇచ్చారు. ఇదిగో ఇలా ప్రతి హృదయ విదారక ఘటనపై వెంటనే స్పందిస్తున్న సోనూసూద్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు మళ్లీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Popular Articles