Top 5 This Week

Related Posts

విషాదం: పిల్లలు సహా చెరువులో దూకిన తల్లి

ఇద్దరు చిన్నారులు సహా చెరువులో దూకిన ఓ తల్లి విషాదాంతమిది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో శుక్రవారం తెల్లవారు జామున రేఖ అనే తల్లి తన ఇద్దరి చిన్నారులు సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనలో అభిజ్ఞ (3), హన్సిక (6 నెలలు) మృతదేహాలు నీటిలో తేలగా, వారి తల్లి రేఖ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రేఖ ఇందుకు పాల్పడడం వెనుక కుటుంబ కలహాలు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles