Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సైబర్ నేరాల నిందితునితో కేటీఆర్ ఫొటోలు వైరల్!

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
సమాజంలోని భిన్నరంగాలకు చెందిన వ్యక్తులు ప్రముఖ రాజకీయ నాయకులతో ఫొటోలు దిగుతుంటారు. ఇక పార్టీకి చెందిన కార్యకర్తలైతే ఇటువంటి ఫొటోలకు కొదువే ఉండదు. అభిమానంతో ఫొటో తీసుకుంటామంటూ దరిచేరిన వ్యక్తులను, పార్టీ కార్యకర్తలను రాజకీయ నాయకులు కాదనలేకపోవచ్చు. అయితే ఈ తరహాలో కొందరు వ్యక్తులతో సందర్భానుసారం ప్రముఖ నేతలు దిగే ఫొటోలు ఒక్కోసారి తీవ్ర వివాదాస్పదంగా కావచ్చు., లేదా ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు అస్త్రంగానూ మారవచ్చు.

ఇదే తరహాలో కాబోలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఓ వ్యక్తి వేర్వేరు సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘సైబర్’ నేరాల కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉన్న ఆ వ్యక్తి కేటీఆర్ తో దిగిన ఫొటోలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారడమే అసలు విశేషం.

ప్రపంచస్థాయి సైబర్ నేరాల్లో నిందితుడైన ఇతను కేవలం వ్యక్తి మాత్రమే కాకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు కూడా. పోట్రు ప్రవీణ్ పేరు తెలుసా? ఈ పేరెక్కడో విన్నట్టుంది కదూ! ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో ఖమ్మం జిల్లా రవాణా శాఖ రిజిస్ట్రేషన్ తో 0007 అనే నెంబరు గల ఖరీదైన ‘డిఫెండర్’ కారు ముందు ఫోజిచ్చి నిలబడిన వ్యక్తే పోట్రు ప్రవీణ్. బీఆర్ఎస్ పార్టీకి కల్లూరు మండలంలో స్థానిక నాయకుడు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్ధతిచ్చిన అభ్యర్థులకు, ఆ పార్టీ నుంచి రెబల్స్ గా ఎన్నికల్లో నిలబడినవారికి కోట్ల రూపాయలను విసిరేసినట్లుగా ఖర్చు చేసినట్లు ప్రాచుర్యంలోకి వచ్చాడు పోట్రు ప్రవీణ్.

అయితే పోట్రు ప్రవీణ్ పై అటు హైదరాబాద్ లో, ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియావాసులే టార్గెట్ గా హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడి పోట్రు ప్రవీణ్ గ్యాంగ్ రూ. కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్లపాటు ఆస్ట్రేలియన్లను మోసం చేసి 8-10 కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టినట్లు హైదరాబాద్ పోలీసులు గత నవంబర్ 29వ తేదీన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన మరో కేసులో పోట్రు ప్రవీణ్ అరెస్టయి ప్రస్తుతం రిమాండులో ఉన్నాడు. అయితే బీఆర్ఎస్ స్థానిక నాయకునిగా కేటీఆర్ తో పోట్రు ప్రవీణ్ దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.

Popular Articles