ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆమె జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో, పోలీస్ కమిషనర్లతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. రెండు విడతలలో స్థానిక సంస్థలను, మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే ఎన్నికలు జరిగే ప్రాంతాలలో అమలులోకి రావడం జరుగుతుందన్నారు. ఎంసీసీ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టే రిపోర్ట్ అందించాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా, ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో, సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలకు పాల్పడేవారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని రాణి కుముదుణి అదేశించారు.


