తన ఆరోగ్య స్థితిపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ఆరోగ్య స్థితిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ప్రతి మనిషికీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని, తనకు రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయని, డాక్టర్లు ఉన్నారని, ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా అధిగమిస్తానని చెప్పారు. అంతేకాదు తాను 80 ఏళ్ల వరకు బతుకుతానని, 70 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ అడవిలోని ‘సింహం’ కథను పార్టీ కార్యకర్తలకు చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో పూర్తిగా చూడవచ్చు..

