Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చిన్నారుల కళ్ళల్లో ఆనందమే లక్ష్యం: వత్సవాయి రవి

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కళ్ళలో ఆనందాన్ని చూడటమే తన లక్ష్యమని, అందుకోసమే రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు ఖమ్మంలోని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వాత్సవాయి రవి అన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రధాన కార్యాలయంలో రవి శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో చేపట్టిన ఈ శిబిరంలో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ సంస్థకు చెందిన మార్కెటింగ్ సిబ్బంది, ఉద్యోగులు, అభిమానులు దాదాపు 200 మంది తరలి వచ్చి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వత్సవాయి రవి మాట్లాడుతూ, తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందనగా వందలాది మంది రక్తదానం చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నారులు నిత్యం నెత్తుటి యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. బాల్యంలోనే పసిపిల్లలు బలిపీఠం ఎక్కు కూడదని సంకల్పంతోనే ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.అలాంటి పిల్లలకు రక్తం ఇచ్చి కాపాడటం మనందరి కర్తవ్యంగా భావించాలని తెలిపారు. అందుకే తన జన్మదిన వేడుకల్లో ఆడంబరాలకు బదులుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని భావించినట్లు స్పష్టం చేశారు.

ఆపదలో ఉన్న వ్యక్తులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తం ఎక్కించడంతో పాటు మెడిసిన్స్ అవసరం కూడా అధికంగా ఉంటుందని బావించి శ్రీ బాలాజీ ఫౌండేషన్ తరపున 2 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా చెక్కు రూపంలో ఇచ్చినట్లు చెప్పారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ వత్సవాయి రవి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం వత్సవాయి రవి జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వత్సవాయి రేణుక రవి, కొణిజర్ల మాజీ ఎంపీపీ గోసు మధు, ప్రధాన కార్యాలయం ఇన్ చార్జ్ పోగుల రవికుమార్, సంకల్ప స్వచ్ఛంద సంస్థ పౌండర్ అనిత, రవి కుమార్, డాక్టర్ నారాయణ మూర్తి, కార్యాలయం సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది, సంకల్ప ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Popular Articles