‘సమీక్ష’ న్యూన్ ఆక్షేపణతో ‘దిశ’ వెబ్ సైట్ నిన్న ప్రచురించిన తన పోస్టులోని స్క్రిప్టును మార్చుకుంది. భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యోదంతంలో ‘సమీక్ష’ ప్రచురించిన వార్తా కథనంలోని కొంత భాగాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసిన అంశాన్ని ‘ఇదేం పని ‘దిశ’? ఈజీ జర్నలిజమా!?’ అనే శీర్షికతో ప్రశ్నిస్తూ శుక్రవారం పోస్ట్ ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ అంశం జర్నలిస్టు సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదీ చదవండి:
ఈ పరిణామాల్లో ‘దిశ’ వెబ్ సైట్ ఎట్టకేలకు తన పోస్టులోని ‘సమీక్ష’ కథనం నుంచి కాపీ పేస్ట్ చేసిన అక్షరాలను తొలగించింది. ‘రాజలింగమూర్తి భార్య ఫిర్యాదులో ఏమున్నదంటే..?’ అనే శీర్షికతో నిన్న ప్రచురించిన అదే పోస్టులో, అదే పర్మా లింక్ తొ, అదే హెడింగ్ తో గల వార్తలో తనదైన స్క్రిప్టుతో శుక్రవారం సాయంత్రం ‘దిశ’ పబ్లిష్ చేసింది. నిన్న రాత్రి 8.11 గంటలకు ప్రచురించిన ఆయా పోస్టు ఈరోజు సాయంత్రం 5.42 గంటలకు Update చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం. ‘దిశ’ వెబ్ సైట్ కాపీ పేస్ట్ చేసిన ‘కంటెంట్’కు సంబంధించి చురకలంటిస్తూ ‘సమీక్ష’ ఈరోజు ఉదయం 12 గంటల ప్రాంతలో పోస్ట్ ప్రచురించిన విషయం విదితమే.

