Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

… ఒక్కటే నిమిషంలో రాజీనామా చేస్తా!

బీజేపీ నాయ‌కుల‌కు సవాల్ విసిరిన సీఎం కేసీఆర్

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌చారాల‌పై తెలంగాణా సీఎం కేసీఆర్ అనూహ్యరీతిలో స్పందించారు. జ‌న‌గామ జిల్లాలోని కొడ‌కండ్ల‌లో రైతువేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. పెన్ష‌న్ల‌కు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని చెబుతున్నారని, ఒక వేళ దాన్ని ఎవ‌డైనా మొగోడు రుజువు చేస్తే ఒక్క‌టే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని సీఎం కేసీఆర్ స‌వాల్ చేశారు.

దుబ్బాక‌లో ఉప ఎన్నిక జ‌రుగుతోందని, అక్క‌డ బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదన్నారు. అక్క‌డ టీఆర్ఎస్ పార్టీ బ్ర‌హ్మాండంగా ఉందని, దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయ‌కులు ఘోరాతి ఘోర‌మైన అబ‌ద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మ‌న రాష్ట్రంలో 38 ల‌క్ష‌ల 64 వేల 751 మందికి అన్ని ర‌కాల పెన్ష‌న్లు ఇస్తున్నామని, అంద‌రికీ నెల రాగానే పెన్ష‌న్లు ఇస్తున్నామని చెప్పారు.

ఈ పెన్ష‌న్ల‌లో కేంద్రం కేవ‌లం 7 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే ఇస్తుందని, మ‌నిషికి రూ. 200 మాత్ర‌మే కేంద్రం ఇస్తున్నదని, సంవ‌త్స‌రానికి క‌లిపి కేంద్రం ఇచ్చేది రూ. 105 కోట్లు మాత్ర‌మేనని అన్నారు. రాష్ట్రం రూ. 10 వేల కోట్ల‌ నుంచి 11 వేల కోట్లు ఇస్తున్నదని, బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఈ విష‌యాల‌న్నీ ప్ర‌జ‌లంద‌రికీ తెలియాలన్నారు.

కాగ్ లెక్క తీసి అధికారికంగా విడుద‌ల చేసిందని, తాను చెప్పే లెక్క‌ల‌న్నీ కాగ్ వ‌ద్ద ఉన్నాయని, ఒక వేళ తాను చెప్పేది అబ‌ద్ధ‌మే అయితే, ఎవ‌డ‌న్న మొగోడు రుజువు చేస్తే తాను ఒక్క‌టే నిమిషంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఇంటికి పోతానని కేసీఆర్ ప్రకటించారు. ఓట్ల కోసం ఘోర‌మైన మోసాలు చేస్తున్నారని, హృద‌యంలో నిజ‌మైన ప్రేమ‌లేదుని, వారికి ఓట్లు మాత్ర‌మే కావాలన్నారు. ఈ మ‌ధ్య‌నే కేంద్రం వ్య‌వ‌సాయ బిల్లు తెచ్చిందని, గుండాగిరి చేసి బిల్లును ఆమోదించుకున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

Popular Articles