ఏపీలో ఓ పార్లమెంట్ సభ్యుడు శనివారం అరెస్టయ్యారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రకటించింది. ఈ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని విజయవాడలోని సిట్ ఆఫీసులో దాదాపు ఏడు గంటలపాటు విచారించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు సిట్ వెల్లడించింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు సమాచారాన్ని ఆయన బంధువులకు సిట్ అధికారులు తెలియజేశారు.
కాగా విచారణకు హాజరయ్యే ముందు ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని, కేసులు ఇందులో భాగమేనని ఆరోపించారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయ ఏముంటుందని ఎంపీ మిథున్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మిథున్ రెడ్డి అరెస్టును కూటమి ప్రభుత్వ కుట్రగా వైఎస్ఆర్ సీపీ నాయకులు అభివర్ణించారు.
