Top 5 This Week

Related Posts

ఎవరితోనైనా పోరాడుతా!

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల వివాదంపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా షర్మిల సోమవారం ఈమేరకు స్పందించారు. తెలంగాణాకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని, అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

తెలంగాణాకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటానని చెప్పారు. తెలంగాణా ప్రజల కోసం నిలబడతామని, కొట్లాడుతానని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులపై వివాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా దిగువన గల ట్వీట్ లో చూడవచ్చు.

Popular Articles