Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

షర్మిల పార్టీ: పుస్తెలు తీసి రోదిస్తున్న మహిళ వీడియో కలకలం

వైఎస్ షర్మిల పార్టీని ఉటంకిస్తూ ఓ మహిళ తన పుస్తెల తాడును తీసి రోదిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘షర్మిలమ్మ పార్టీలోకి వచ్చినందుకు ఒక ఆడదానికి ఇచ్చిన బహుమానమిది. పుస్తెలతాడు కుదువబెట్టి పార్టీకి… జనానికి కట్టడానికి పుస్తెలే తీస్తున్న… తాడుతో సహా. బుద్ధి తక్కువై… ఇంకెప్పుడూ పార్టీలో తిరగకూడదు. తిరిగితే ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క ఆడదానికి…’ అంటూ ఓ మహిళ కంటతడి పెడుతూ రోదిస్తున్న వీడియో పలువురిని కలచివేస్తోంది. అయితే ఈ మహిళ ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? ఎందుకిలా రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు? అసలు జరిగిందేమిటి? వంటి వివరాలు మాత్రం వీడియోలో లేవు. ఈనెల 9న ఖమ్మం నగరంలో వైఎస్ షర్మిల నిర్వహించిన సంకల్ప సభ కోసం జనాన్ని తరలించడానికి ఈమె ఏదేని మొత్తంలో డబ్బు ఖర్చు చేశారా? ఆ తర్వాత ఆమెను ఎవరూ పట్టంచుకోలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన మెడలోని పుస్తెల తాడును తీసి కత్తెరతో కట్ చేసి మరీ రోదించిన ఈ మహిళ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఆయా వీడియోను దిగువన చూడవచ్చు.

UPDATE:
కాగా తొలుత ఈ వీడియోను పోస్ట్ చేసిన యువతి ఆ తర్వాత మరో వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. షర్మిలమ్మ అంటే తనకు ఎక్కడాలేని అభిమానమని, ఏదో ఆవేశంలో, ఎమోషన్ లో పెట్టేశాను అలా…తనను క్షమించాలి’ అని అభ్యర్థించారు. షర్మిల పార్టీ అన్నా, షర్మిల అన్నా తనకు చాలా అభిమానమని, ఏమీ అనుకోవద్దని కోరారు.

Popular Articles