Top 5 This Week

Related Posts

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. స్వల్ప నీరసంతో కేసీఆర్ ఆసుపత్రిలో చేరారని, కేసీఆర్ హై షుగర్, లో సోడియం లెవెల్స్ తో ఉన్నారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉందని, ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచామని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులతో, అధికారులతో మాట్లాడారు. కేసీఆర్ కు అత్యుత్తమ చికిత్స అందించాలని ఆదేశించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి యశోద ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.

Popular Articles