Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

సర్పంచ్ పెళ్లిలో వైరా ఎమ్మెల్యే డాన్స్!

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మంగళవారం ఓ పెళ్లి వేడుకలో చేసిన డాన్స్ వీడియో ఆకట్టుకుంటోంది. తనదైన స్టైల్లో రాములు నాయక్ వేసిన స్టెప్పులు ‘ధూం ధాం’ తరహాలో ఉండడం విశేషం. నియోజకవర్గంలోని కారేపల్లి మండలం పాటిమీద గుంపు గ్రామ సర్పంచ్ బానోత్ శంకర్ వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరయ్యారు.

ఈ సందర్భంగా వధూవరులు, ఎంపీపీ, జడ్పీసీసీ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాములు నాయక్ డాన్స్ చేసి సందడి చేశారు. ఎమ్మెల్యే డాన్సు చేస్తున్నంతసేపు చప్పట్లు, ఈలలతో వేడుక ప్రాంగణం మర్మోగడం విశేషం. రాములు నాయక్ డాన్స్ వీడియోను దిగువన మీరూ చూసేయండి.

Popular Articles