Top 5 This Week

Related Posts

‘మాజీ సర్పంచ్’కు మహిళల దేహశుద్ధి

మాజీ సర్పంచ్ ఒకరు దారి తప్పి ప్రవర్తించాడు. ఫలితంగా మహిళల చేతిలో చెప్పు దెబ్బలు తినాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసు సతీష్ మద్యం సేవించిన మత్తులో పెగడపల్లిలో ప్రవేశించి హల్చల్ చేశాడు. గ్రామంలోని ఓ ఇంట్లో చొరబడిన మాజీ సర్పంచ్ సతీష్ ను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. మహిళలు చెప్పులతో కొట్టారు.

అర్ధరాత్రి వేళ ఎవరి కొంప ముంచడానికి వచ్చావ్? అంటూ అతన్ని మహిళలు చెప్పులతో కొడుతూ సత్కరించారు. దొంగతనానికే వచ్చాడంటూ స్థానికులు నిందించారు. అయితే తాను తప్పు చేస్తే కొట్టాలంటూ సతీష్ స్థానికులను వేడుకున్నాడు.

మద్యం మత్తులో గ్రామంలోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఫొటో: సతీష్ ను చెప్పులతో కొడుతున్న మహిళ

Popular Articles