Top 5 This Week

Related Posts

మేడిన్ ఖమ్మం బ్రాండ్.. వుమెన్ మార్ట్

మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళా మార్ట్ ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సీక్వెల్ రోడ్డులో మహిళా మార్ట్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించి, సమకూర్చాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సమన్వయంతో గ్రామీణ మహిళా ఉత్పత్తులు అమ్మేందుకు వీలుగా మహిళా మార్ట్ ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా బ్రాండింగ్ వచ్చేలా లోగో, స్టిక్కరింగ్ డిజైన్ తయారు చేయాలని, మహిళా మార్ట్ ప్రత్యేకత తెలిసే విధంగా భవనానికి పెయింటింగ్స్ వేయించాలని, అమ్మే ఉత్పత్తుల వివరాలు, తయారీ విధానం, అమ్మే మహిళ స్టోరీనీ డాక్యుమెంట్ చేస్తూ ఫ్లెక్సీ రూపంలో ప్రొడక్ట్ పక్కన ప్రదర్శించే విధంగా చూడాలన్నారు.

మహిళా మార్ట్ ఏర్పాటు చేసే భవనం వద్ద ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రైవేట్ షాపింగ్ మాల్స్ లో అనుసరిస్తున్న మోడళ్లను పరిశీలించి మహిళా మార్ట్ ప్రత్యేకతగా ఉండేలా మార్ట్ లోపల ఫర్నిచర్, ఇతర ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాల ద్వారా తయారు చేసే వస్తువులకు మంచి మార్కెటింగ్ మన మహిళా మార్ట్ ద్వారా అందించి అధిక ఆదాయం సంపాదించాలన్నారు. వచ్చే నెల 3వ వారంలోగా మహిళా మార్ట్ ఏర్పాటయ్యే విధంగా కార్యాచరణ ఉండాలని కలెక్టర్ నిర్దేశించారు. మహిళా మార్ట్ గ్రౌండ్ అయిన తరువాత మహిళా సంఘాలు వ్యాపార దృక్పథంతో లాభాలు వచ్చే విధంగా నడపాలని అన్నారు.

మహిళా సంఘాల ద్వారా లాభదాయకంగా నడిచే యూనిట్లపై ప్రచారం కల్పించాలని అన్నారు. మహిళా మార్ట్ మహిళా సంఘాల ద్వారా తయారు చేసే పదార్థాలకు బ్రాండింగ్ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి వస్తువుపై మేడ్ ఇన్ ఖమ్మం స్టిక్కరింగ్ ఉండాలని, పదార్దాల బ్రాండింగ్ పెంచేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, అదనపు డిఆర్డీవో నూరొద్దీన్, ఇంచార్జ్ ఎస్సీ కార్పొరేషన్ ఇడి నవీన్ బాబు, డిపిఎం దర్గయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles