యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అడవిదున్న హల్చల్ చేస్తోంది. చిక్కకా.., దొరకకా రైతులకు చుక్కలు చూపిస్తోంది. పంటపొలాల్లో స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామ పరిసర ప్రాంతంలో కొంతకాలంగా సంచరిస్తున్న అడవి దున్నను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా దున్నమాత్రం అస్సలు దొరకడం లేదు.
తప్పించుకున్న అడవిదున్న ఇంతవరకూ జాడలేదు. ప్రస్తుతం ఈ అడవిదున్న కోసం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సహజంగా ఇలాంటి అడవి దున్నలు దట్టమైన అటవీ ప్రాంతాల్లోనే ఉంటాయి. మనుషులు, క్రూర మృగాలు కనబడితే చాలు అవి దాడులకు తెగబడుతాయి. అలాంటి అడవి దున్న గ్రామంలోకి ఎలా ఎంటర్ అయ్యిందనేది అంతుచిక్కడం లేదు. కాగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా పంట పొలాలకు వెళ్ళడం అంత సేఫ్ కాదని హెచ్చరిస్తున్నారు.