పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యునిగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకుమరోసారి ఛాన్స్ లభించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకపు ప్రక్రియలో భాగంగా వద్దిరాజు రవిచంద్రను మరోసారి పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ మేరకు లోక్ సభ డిప్యూటీ సెక్రటరీ సుజయ్ కుమార్ శుక్రవారం నియామాకపు ఉత్తర్వును జారీ చేశారు.
మొత్తం 31 మంది సభ్యులు గల ఈ కమిటీలో లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి నియామాకమయ్యే ఈ కమిటీకి రవిచంద్ర వరుసగా మూడోసారి సభ్యుడిగా ఎంపిక కావడం విశేషం. కాగా ఈ దఫా పెట్రోలియం, సహజ వాయువు స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా పార్లమెంట్ సభ్యుడు సునీల్ దత్తాత్రేయ తట్కరే కొత్తగా ఎన్నికయ్యారు.