Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చాతకొండ బెటాలియన్ కు ఎంపీ వద్దిరాజు నిధులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాతకొండలో గల 6వ బెటాలియన్ కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిధులు కేటాయించారు. బెటాలియన్ లో పలు అభివృద్ధి పనుల కోసం వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు నిధులు కేటాయింపు లేఖను సంబంధిత అధికారులకు అందజేశారు.

బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాదరెడ్డి, ఆర్.ఐ జీవి రామారావులు ఖమ్మంలో ఎంపీ రవిచంద్రను కలిసి బెటాలియన్ కు నిధులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన తమ బెటాలియన్ కు ప్రత్యేక నిధులు లేకపోవడం చేత అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తే బెటాలియన్ లో సెల్యూటింగ్ డయాస్, గ్యాలరీ నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు.

దీంతో బెటాలియన్ కు చెందిన ఆయా అధికారుల విజ్ఞప్తి మేరకు వద్దిరాజు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 20 లక్షలు మంజూరు చేస్తూ అందుకు సంబంధించిన లేఖను కూడా బెటాలియన్ కమాండెంట్ శివప్రసాదరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Popular Articles