Top 5 This Week

Related Posts

కిషన్ రెడ్డి వరంగల్ పర్యటన

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ఈనెల 11వ తేదీన రోడ్డు మార్గం ద్వారా ఆయన వరంగల్ చేరుకోన్నారు. ఉదయం 9.30 గంటలకు భద్రకాళి దేవాలయంలో అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తనిఖీ, హృదయ్ పథకం కింద చేపట్టిన భద్రకాళి చెరువు పనుల తనిఖీ, హన్మకొండలోని బుగ్గలోనిగుట్టలో జైన్ హెరిటేజ్ సెంటర్ సైట్ పనులను తనిఖీ చేయనున్నారు.

అనంతరం పగలు 12.30 గంటలకు సర్క్యూట్ గెస్ట్ హౌజ్ లో రైల్వే అధికారులతో, స్మార్ట్ సిటీ, అమృత్ పథకాల కింద నగరంలో చేపట్టిన పనులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు నకిరేకల్ వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Popular Articles