Top 5 This Week

Related Posts

Alert: దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు

ఢిల్లీ: మన దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు చెలామణిలో ఉన్నాయి. ఇది ఎవరో చేస్తున్న ఆరోపణ కాదు. సాక్షాత్తూ యూజీసీ (యూనివ్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది, విద్యార్థులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. యూజీసీ డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా 22 గుర్తింపులేని ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో దేశ రాజధాని ఢిల్లీలోనే 9 ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 5 ఉన్నాయి. మిగతావి కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది.

బ్రోకర్ నెట్ వర్క్ లతో మాయచేస్తూ ఫేక్ యూనివర్సిటీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఫేక్ యూనివర్సీటీలు తమ సంస్థల పేర్ల సరసన ‘నేషనల్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇనిస్టిట్యూట్, విద్యాపథ్, పరిషద్, ఓపెన్ యూనివ్సిటీ’ వంటి పదాలను ఉపయోగిస్తున్నట్లు యూజీసీ గుర్తించింది. అదేవిధంగా ఢిల్లీ కోట్లా ముబారక్ పూర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ విషయంలో కూడా యూజీసీ మరోసారి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఈ సంస్థ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని, ఇది జారీ చేసే డిగ్రీలకు ఎటువంటి విలువ లేదని యూజీసీ స్పష్టం చేసింది. నకిలీ యూనివర్సిటీల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూజీసీ ఈ సందర్భంగా సూచించింది.

Popular Articles