Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ప్రజలకు మరిన్ని శుభాలు జరగాలి: ఖమ్మం ప్రముఖ నేతల ఆకాంక్ష

తెలుగు ప్రజలకు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలు వేర్వేరుగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన తెలుగు సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు మరింత సంతోషంగా ఉండాలని, సుఖ శాంతులతో, సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆయా నాయకులు ఆకాంక్షించారు.

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజూ పండగ రోజేనని అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘శ్రీ విశ్వావసు నామ’ సంవత్సరంలోనూ ఇదే రకమైన పాలనను కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దరిచేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం ప్రజలకు, పాత్రికేయులకు, రైతాంగ సోదరులకు తెలుగు నూతన నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీక్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు, దేశవిదేశాలలో నివసిస్తున్న,స్థిరపడిన తెలుగు వారందరికి ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు చెప్పారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తెలుగు వారందరికీ మరిన్ని శుభాలు కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.

Popular Articles