Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కల్లు తాగిన మంత్రులు

ఇద్దరు తెలంగాణా మంత్రులు శుక్రవారం కల్లు సేవించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు బయలుదేరారు.

మార్గమధ్యంలో గీత కార్మికులు ఉన్న కల్లు మండువ వద్దకు మంత్రులు వెళ్లి వారి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికుల సమస్యలను తెలుకుని సాంప్రదాయ తాటి కల్లును మంత్రులు సేవించి తమ సంతోషాన్ని గీత కార్మికులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు.

Popular Articles