Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

తహశీల్దార్ కు రెండు ఇంటర్నెట్ కనెక్షన్లు!

తెలంగాణాలోని తహశీల్దార్లకు రెండు ఇంటర్నెట్ కనెక్షన్లను ప్రభుత్వపరంగా కల్పించనున్నారు. దసరా పండగకల్లా ‘ధరణి’ పోర్టల్ సిద్ధం కానుంది. అదే రోజున భూ లావాదేవీలు ప్రారంభ మవుతాయని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యలోనే అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు.

ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా ‘ధరణి’ ప్రాజెక్టును నిర్వహించేందుకు స్వాన్ కనెక్టివిటీ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ధరణి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి కార్యాలయానికి ఫుల్ నెట్వర్క్ సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని 590 తహశీల్దార్ కార్యాలయాలకు ప్రస్తుతం 12 ఎంబీపీఎస్ వేగం కలిగిన బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉండగా, అదనంగా మరో కనెక్షన్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

తహశీల్దార్లు స్వయంగా స్థానికంగా మంచి నెట్వర్క్ కలిగిన కనెక్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులో స్వాన్ ఆపరేషన్, నిర్వహణను అక్షర ఎంటర్ ప్రైజెస్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు

Popular Articles