Top 5 This Week

Related Posts

ఇద్దరు డీఎస్పీల దుర్మరణం

హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా, చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీలను చక్రధర్ రావు, శాంతారావులుగా పోలీసులు గుర్తించారు. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావులుగా గుర్తించి చికిత్స కోసం వారిని ఏల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. దుర్మరణం చెందిన ఇద్దరు డీఎస్పీలు ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం.ఓ కేసు గురించి విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘటనా స్థలిలో పోలీసు అదికారులు ప్రయాణించిన వాహనం

Popular Articles