Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

MMTS రైలులో అత్యాచార యత్నం ఘటనలో ట్విస్ట్

సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటనకు సంబంధించిన కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో బాధితురాలిగా పేర్కొన్న యువతి పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు రైల్వే ఎస్పీ చందనా దీప్తి ప్రకటించారు. ఈ కేసులో ఫిర్యాదు, కేసు నమోదు అనంతరం దర్యాప్తులో భాగంగా 300కు పైగా సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. అంతేకాదు సుమారు 120 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు.

అయితే మొత్తం ఘటనలో యువతి విచారణలో తప్పుదోవ పట్టించినట్లు రైల్వే ఎస్పీ వెల్లడించారు. సెల్ ఫోన్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా యువతి ప్రమాదవశాత్తు జారిపడినట్లు ఆమె తెలిపారు. కానీ తనపై అత్యాచార యత్నం జరిగినట్లు ఆ యువతి పోలీసులను నమ్మించినట్లు చెప్పారు. అనంతపూర్ జిల్లాకు చెందిన ఈ యువతి ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఎంఎంటీఎస్ రైలులో యువకుడొకరు యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Advertisement

గత నెల 22వ తేదీన మేడ్చల్ జిల్లా కొంపల్లి సమీపాన గల రైలు వంతెన కింద గాయపడిన యువతిని గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ప్రయైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు అనంతరం యువతిపై అత్యాచార యత్నం జరగలేదని, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్లు పోలీసులు తేల్చారు.

Popular Articles