Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

‘చూస్కుందాం…’ పోలీసులకు టీఆర్ఎస్ యూత్ లీడర్ సవాల్

‘చూస్కుందాం…’ అంటూ అధికార పార్టీకి చెందిన యూత్ లీడర్ ఒకరు పోలీసులకు సవాల్ విసిరిన ఉదంతమిది. మణుగూరు సబ్ డివిజన్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నడిబజారులో కూర్చుని పీకల దాగా మద్యం సేవించిన టీఆర్ఎస్ యూత్ లీడర్ల ఘన కార్యంపై పోలీసులు కూడా ఘాటుగానే స్పందించారు. ఈమేరకు కేసులు కూడా నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెడితే…

టీఆర్ఎస్ యువజన సంఘం పినపాక నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి సాగర్ యాదవ్ తదితరులు నడిబజారులో వాహనాలను నిలిపి, మద్యం సీసాలతో బైఠాయించిన సీన్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సాక్షాత్కరించింది. ఇదేమిటని ప్రశ్నించిన పోలీసులతో అధికార పార్టీ యువజన విభాగపు నేతలు ఎలా రియాక్టయ్యారో చెప్పడం దేనికి… దిగువన గల వీడియోలో మీరే చూసేయండి మరి!

https://youtu.be/OjOjpWCW5v8

Popular Articles