Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సర్కార్ పథకాలపై ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, ప్రత్యేక రాష్ట్ర తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి. రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే సర్కార్ పథకాలు అమలు చేస్తామన్నారు. వచ్చే మూడేళ్ల కాలంలో తమ పార్టీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామని స్పష్టంగానే చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని చిల్పూరు మండలం రాజవరం, నూనావత్ తండాలో జరిగిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాజయ్య ఈ అంశంపై ఇంకా ఏం మాట్లాడారో దిగువన గల వీడియోలో చూడవచ్చు.

Popular Articles