Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ముగ్గురు ఎమ్మెల్యేల తలలకు టీఆర్ఎస్ నేత ‘వెల’!

ఆంధ్రప్రదేశ్ లోని ఓ మంత్రి సహా ముగ్గురు ఎమ్మెల్యేల తలలకు ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు ‘వెల’ కట్టారు. గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడాలి నాని, గన్నవరం, సత్తెనపల్లి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, అందుకు తాను రూ. 50 లక్షల మొత్తాన్ని ఆర్థికంగా చేయూతనిస్తానని ప్రకటించారు టీఆర్ఎస్ నేత, మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు.

మధిర ప్రాంతానికి చెందిన మల్లాది వాసు స్థానికంగా నిర్వహించిన ‘కమ్మ’వారి వన సమారాధాన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులపై మల్లాది వాసు ఈ సందర్భంగా చేసిన కొన్ని పదాలు కూడా తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య చోటు చేసుకున్న ఇటీవలి వివాదంలో మల్లాది వాసు ‘కుల’ ప్రస్తావన చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇందులో భాగంగానే ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల భౌతిక నిర్మూలనకు భారీ మొత్తాన్ని ‘ఆఫర్’గా ప్రకటించడం తీవ్ర వివాదంగా మారింది.

ఇంతకీ మల్లాది వాసు చేసిన ఆయా వ్యాఖ్యలేమిటో దిగువన గల వీడియోలో చూసేయండి.

https://youtu.be/QOhDnUoPOek

Popular Articles