Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

విషాదం: సిరిసిల్లలో టీఆర్ఎస్ లీడర్ గల్లంతు

సిరిసిల్ల నియోకవర్గానికి చెందిన టీఆర్ఎస్ స్థానిక నాయకుడొకరు వరదల్లో గల్లంతయ్యారు. తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్ ఓ వాగులో పడి గల్లంతైన ఘటన అధికార పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

శ్రీనివాస్ నిన్న రాత్రి తన ముగ్గురు స్నేహితులతో కలి వాహనంలో వెడుతూ సిద్ధిపేట జిల్లా దర్గాపల్లి వద్ద గల వాగులో పడిపోయారు. స్థానికులు గమనించి వాగులో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడగలిగారు. కానీ… కారుతోపాటు శ్రీనివాస్ మాత్రం వాగులో గల్లంతయ్యారు.

ఈ దుర్టఘటనపై మంత్రి కేటీఆర్ సోమవారం స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధిపేట ఆర్డీవో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Popular Articles