గవర్నమెంట్ హాస్పిటల్లో నేలమీద పడుకున్న పదిమంది పేషంట్స్ లో ఒకడిగా పడుకోవాలి ఒకే నా అంటే… ఇదే సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా పాత్ర ఇచ్చారు అప్పుడు అడగలేదే ఇలా అని అడిగారుట కోట శ్రీనివాసరావు.
ఇది నటనకి ఆయనిచ్చే గౌరవం. ఇది పాత్రకి ఆయనిచ్చే మర్యాద.
‘గణేష్’ సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ సాంబశివుడు గుర్తున్నాడా..?
గుండుకి విగ్గు, భయంకరంగా ఉండే కన్నుతో తెలంగాణా యాసలో సినిమా మొత్తాన్నీ చితక్కొట్టి వదిలిపెడతాడు.
చూసే మనకి వీడు కనిపిస్తే చంపేయాలి అనేంత కసిని పెంచుతాడు.. ఇది కదా నటన అంటే.

ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయిపోయి ఇదంతా నటన, సినిమా అనేది అది ఆ పాత్రధారి, చూసే ప్రేక్షకుడు మర్చిపోతే కరెక్ట్ గా కనెక్ట్ అయినట్టు.
గణేష్ సినిమాలో హెల్త్ మినిష్టర్ సాంబశివుడుగా అదిరే డైలాగ్స్ తనవి..
నేను యాభైకోట్ల కుంభకోణం చేశినా..కాదంటలే
నాకైతే చార్మినార్కున్నంత హిస్టరున్నది మల్ల.. అంటాడు.
నిజమే కోట హిస్టరీ మామూలుగా వుండదు.
అసలు తమ్మీ…అనేమాట ఎక్కడ విన్నా గుర్తుకి వచ్చేది కోట.
‘ఖండిస్తున్నా’
గాయం సినిమాలో డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తుంది.
కోటలో నటనని ఈవీవీ సత్యనారాయణ చూపించిన విధానం హైలెట్..
విలనిజానికి పరాకాష్ట ‘ఆమె’ సినిమా .
తన ప్రతిభకి వేలెత్తి విమర్శించే అవకాశం ఇవ్వని నటుడు.
నలభై ఏళ్లపాటు అందర్నీ అలరించి విశ్రాంతి అనేసిన కోట శ్రీనివాసరావు.
పద్మశ్రీ తాడి మట్టయ్యా ..సెలవయ్యా!
(By Vydehi Murthy)

