Top 5 This Week

Related Posts

ముగ్గురు డీఎస్పీల బదిలీ

తెలంగాణాలో మరో ముగ్గురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్బీ నగర్ ఏసీపీగా పనిచేస్తున్న కె. పృథ్వీధర్ రావును ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా, ఇదే విభాగంలో గల కె. పురుషోత్తంరెడ్డిని వనస్థలిపురం ఏసీపీగా, రామగుండం సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్. మహేశ్వర్ ను సీఐడీలోకి డీఎస్పీగా బదిలీ చేస్తూ, డయల్ 100కు అటాచ్ చేశారు. రెండు రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

Popular Articles