Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పది మంది సీఐల బదిలీ

తెలంగాణా మల్టీ జోన్-1 పరిధిలో పది మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీకి గురైన సీఐల వివరాల్లోకి వెడితే.. పి. బాలాజీ వరప్రసాద్ ను సీసీఎస్ వరంగల్ నుంచి ఆసిఫాబాద్ కు, బుద్దె రవీందర్ ను ఆసిఫాబాద్ నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్, మరముల సంజయ్ ను రామగుండం కమిషనరేట్ వీఆర్ నుంచి రెబ్బనకు, బుద్దె స్వామిని రెబ్బన నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్, బండారి కుమార్ ను వెయిటింగ్ నుంచి సీసీఎస్ ములుగుకు బదిలీ చేశారు.

అదేవిధంగా బానోత్ రమేష్ ను సీసీఎస్ ములుగు నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని, వెయిటింగ్ లో గల జి. తిరుమల్ ను కరీంనగర్ సీసీఆర్ బీకి, వెయిటింగ్ లో గల బి. సైదాను సిద్ధిపేట కమిషనరేట్ కు బదిలీ చేశారు. దొబ్బల శ్రీలక్ష్మిని సీపీటీసీ ఖమ్మం నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట చేయాలని, ఆలేటి ఇంద్రసేనారెడ్డిని జూలూరుపాడు నుంచి ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో ఆదేశించారు.

Popular Articles