Top 5 This Week

Related Posts

ఖమ్మంలో తీవ్ర విషాదం.. ఫొటో దిగుతూ గుండెపోటుతో మహిళ మృతి, దృశ్యాలు

ఖమ్మం: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన మహిళ ఒకరు సంతోషంతో ఫొటో దిగుతూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే కూప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుస్మిత (43) అనే మహిళ నగరంలోని పుట్టకోట ప్రాంతంలో గల తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ సందర్భంగా సంతోషంతో ఫొటో దిగుతున్న క్రమంలో సుస్మిత అకస్మాత్తుగా కుప్పకూలింది. అప్రమత్తమైన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. గుండెపోటుకు గురైన సుస్మిత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

ప్రేమ వివాహం చేసుకున్న సుస్మితకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త వ్యాపారం నిర్వహిస్తుంటాడు. సుస్మిత తండ్రి ‘భరణి యాడ్స్’ పేరుతో ఓ యాడ్ ఏజెన్సీని నిర్వహించేవారు. సుస్మిత కుప్పకూలిన విషాద ఘటన దృశ్యాలను దిగువన చూడవచ్చు..

Popular Articles