Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

రంజాన్ వేళ.. ఖమ్మం జిల్లాలో విషాదం

పవిత్ర రంజాన్ పండు రోజున ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువులోకి దిగిన తన తండ్రిని కాపాడబోయిన కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆలపాడు గ్రామంలో సోమవారం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆలపాడుకు చెందిన పఠాన్ యూసఫ్ ఖాన్ తన గేదె ఒకటి తప్పిపోవడంతో వెతుక్కుంటూ గ్రామంలోని ఊరచెరువు వద్దకు వెళ్లారు. చెరువులో గేదె కనిపించడంతో దాన్ని అదిలించడానికి యూసఫ్ ఖాన్ చెరువులోకి దిగారు. అయితే గతంలో పంట పొలాల్లోకి చెరువులోని మట్టిని తోలడంతో ఏర్పడిన గుంతలను గమనించని యూసఫ్ ఖాన్ కొద్దిసేపటికే పట్టు కోల్పోయి నీటిలో మునిగిపోయారు. దీన్ని గమనించిన అతని కుమారుడు పఠాన్ కరీముల్లా ఖాన్ తన తండ్రిని కాపాడేందుకు నీటిలోకి దిగాడు.

చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయిన యూసఫ్ ఖాన్, కరీముల్లా ఖాన్

ఈ ప్రయత్నంలో తండ్రితోపాటు కుమారుడు కూడా చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గేదెను అదిలించడానికి చెరువులోకి దిగిన తండ్రీ, కుమారులిద్దరికీ ఈత రాకపోవడం వల్లే ఈ విషాదం నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. రంజాన్ పర్వదినం రోజే జరిగిన విషాద ఘటనలో తండ్రీ, కుమారుడు దుర్మరణం చెందిన ఉదంతంతో ఆలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Popular Articles