హైదరాబాద్-విజయవాడ హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేశారు. లింగమంతుల స్వామి జాతర జరిగుతున్న సందర్భంగా ఈనెల 19వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి వద్ద మళ్లిస్తున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, హూజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్ పల్లి మీదుగా ప్రయాణించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక ఖమ్మం వైపు వెళ్లే వాహనాలను బీబీగూడెం మీదుగా మళ్లిస్తున్నారు.

