Top 5 This Week

Related Posts

ముందస్తు ఎన్నికలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది అనంతరం… అంటే 2022 ఆగస్టు తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని, రాసిపెట్టుకోవాలని రేవంత్ వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేరని, అతన్ని ముఖ్యమంత్రిగా చేయరని కూడా అన్నారు.

జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం లేదని, అది ఎప్పుడైనా పేక మేడలా కూలిపోవచ్చన్నారు. బీజేపీలో చేరడం ద్వారా తెలంగాణా ఉద్యమకారునిగా చెప్పుకనే అర్హతను ఈటెల రాజేందర్ కోల్పోయారని, ఆయన ఇప్పుడు కేపిటలిస్ట్ అని రేవంత్ అన్నారు. జలవివాదంపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సురభి నాటకాలు ఆడుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ ధ్వజమెత్తారు.

Popular Articles