Top 5 This Week

Related Posts

వాళ్లను వదలం… వీళ్లను వదులుకోం…

కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అదేవిధంగా పార్టీకోసం కష్టపడి పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలను వదులుకునేది లేదని కూడా స్పష్టం చేశారు. పెట్రోల్‌, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆ తర్వాత అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభలో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలెవరినీ వదులుకునేది లేదని, పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. పార్టీలోనే ఉంటూ ద్రోహానికి పాల్పడేవారిని వదిలే ప్రసక్తే ఉండబోదన్నారు. ఉద్యమాలతో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ కేడర్ కు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Popular Articles