Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘జీయర్’ వివాదంపై రేవంత్ స్పందన

వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై త్రిదండి చిన జీయర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. జీయర్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా రేవంత్ జీయర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ట్వీట్ ను సీఎంవోకు ట్యాగ్ కూడా చేశారు.

తెలంగాణా పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క, సారలమ్మలను అవమానపర్చిన త్రిదండి చిన జీయర్ ను యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతలను నుంచి తక్షణమే తొలగించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. మన భక్తి, విశ్వాసాలపై దాడి చేసినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

Popular Articles