Top 5 This Week

Related Posts

కరోనాతో ఈ ఎంపీ చనిపోలేదు!

కర్నాటక బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55)కి ఇటీవల కరోనా సోకింది. ఈనెల 2వ తేదీన బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగానే అశోక్ గస్తీ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్ సైట్లు సైతం ఎంపీ అశోక్ గస్తీ మరణించారనే వార్తలను ప్రచురించాయి. ఈ వార్తలను అనుసరించి పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని కూడా ప్రకటించారు. అయితే అశోక్ గస్తీ మరణించలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆయనకు చికిత్స అందిస్తున్న మణిపాల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుదర్శన్ బల్లాల్ ప్రకటించారు. ప్రస్తుతం అశోక్ గస్తీకి ఐసీయూలో లైఫ్ సపోర్ట్ పై చికిత్స కొనసాగిస్తున్నట్లు వివరించారు.

Popular Articles