Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

‘యువ వికాసం’ వాయిదా.. ఎందుకంటే?

రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ పథకానికి అనూహ్య సంఖ్యలో దరఖాస్తులు రావడం, అనర్హులకు యూనిట్లు అందకుండా చూడాలంటూ భారీ సంఖ్యలో వినతులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే అర్హుల జాబితాను వెల్లడించాలని, ఏ ఒక్క అనర్హుడికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరవద్దని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పరిణామాల్లో యూనిట్ల మంజూరు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకపు లబ్ధిదారులకు సోమవారం యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించి, ఇదే వేదికలపై యూనిట్ల పంపిణీకి రంగం సిద్దం చేశారు. ఈనెల 2న సాయంత్రం నిర్వహించే వేడుకల వేదికపై పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈమేరకు వివిధ జిల్లాల కలెక్టర్లు అధికారిక ప్రకటన కూడా జారీ చేశారు. అయితే నిన్న సాయంత్రం మంత్రులతో నిర్వహించిన సమావేశంలో యువ వికాసం యూనిట్ల మంజూరు పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయడం గమనార్హం. పథకం అమలులో అనేక కీలక అంశాలను చర్చించి, సమీక్షించిన తర్వాతే ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Popular Articles