Top 5 This Week

Related Posts

నేడో, రేపో… లక్ష!

తెలంగాణాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. గురువారం నాటికి ఈ సంఖ్య 99,391కి చేరడం గమనార్హం. నిన్న (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా 1,967 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 99,391కి చేరింది.

రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు నేడో, రేపో బాధితుల సంఖ్య లక్షకు చేరుకునే అవకాశముంది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం నిన్న కరోనా సోకి ఎనిమిది మంది మరణించారు.

దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 737కు చేరుకుంది. కరోనా నుంచి నిన్న కోలుకున్నవారి సంఖ్య 1,781 కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,687గా వైద్య, ఆరోగ్యశాఖ నివేదించింది.

Popular Articles