సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ రెచ్చిపోయారు. దాన దాతగా కీర్తించబడుతున్న కర్ణుడికి సినిమాల్లో గొప్పతనాన్ని ఆపాదించడాన్ని ఆయన ఆక్షేపించారు. సినిమాల్లో వినోదం కోసం హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆందోళనం చెందారు. నేరుగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ, ఆయన తీసిన ‘దానవీర శూర కర్ణ’ సినిమా నుంచి ప్రభాస్ నటించిన ‘కల్కి’చిత్రంలో కర్ణ పాత్రలను మల్చిన తీరును దుయ్యబట్టారు.
విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభలో మాట్లాడిన అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు ‘దాన వీర శూర కర్ణ’ పాత్రపై సరికొత్త చర్చకు దారి తీశాయి. కర్ణుడి గురించి అనంత శ్రీరామ్ ఇంకా ఏమన్నారో ఈ దిగువన గల వీడియోలో చూడవచ్చు.