Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

అటు ఆ ఇద్దరు… ఇటు ఈ ఇద్దరు… ఇదే కేసీఆర్ ‘ఫైనల్’ ముద్ర!

రాజ్యసభ, శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు నలుగురు నాయకుల అభ్యర్థిత్వానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనేక సమీకరణల అనంతరం రాజ్యసభకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కె. కేశవరావుల అభ్యర్థిత్వాల వైపే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. అదేవిధంగా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ లకు అవకాశం కల్పిస్తూ కేసీఆర్ ‘ముద్ర’ వేసినట్లు సమాచారం.

Popular Articles